టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పనిచేసిన చాలామంది హీరోయిన్ల కెరీర్లు సడన్గా క్లోజ్ అవుతూ ఉంటాయి. త్రివిక్రమ్ స్టార్ హీరోయిన్లు అయ్యాక వారి క్రేజీ చూసి తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇలియానాకు పోకిరి సినిమా తర్వాత క్రేజ్ వచ్చాక వరుసగా తన సినిమాలలో రిపీట్ చేశాడు. అక్కడ నుంచి ఇలియానా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఇలియానాను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.
సమంత స్టార్ హీరోయిన్ అయ్యాక వరుసగా మూడు సినిమాలలో ఆమెను రిపీట్ చేశాడు. అక్కడి నుంచి సమంత కెరీర్ కూడా సడన్గా పడిపోయింది. టాలీవుడ్ బుట్టబొమ్మగా క్రేజ్ సొంతం చేసుకున్న పూజా హెగ్డే త్రివిక్రమ్ కు వరుస ఆఫర్లు ఇచ్చాడు. త్రివిక్రమ్ చేతిలో పడటానికి ముందే పూజ హెగ్డేకు మంచి క్రేజ్ వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
ఆ తర్వాత పూజహెగ్డే పరిస్థితి కూడ పేనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. ఆమెకు ఛాన్సులు ఇచ్చే వాళ్లే లేరు. శ్రీ లీల – రష్మిక దెబ్బతో పూజ ఛాన్సులు లేక విలవిలలాడుతోంది. ఇక పార్వతీ మెల్టన్ – ప్రణీత సుభాష్ లాంటి హీరోయిన్లు కూడా ఈ దర్శకుడు సినిమాల్లో నటించాక రియల్ లైఫ్ లేకుండా చేశాడన్న సెటైర్లు ఆయనపై ఉన్నాయి.
ఈ లెక్కన చూస్తే త్రివిక్రమ్ కథ నడిపిస్తూ వరుసగా అవకాశాలు ఇస్తున్న సంయుక్త మీనన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉండబోతుందా..! త్రివిక్రమ్ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బతో ఆమెకి కూడా ఛాన్సులు రాకుండా పోతాయా ? అన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. సంయుక్త డైరెక్ట్ గా త్రివిక్రమ్ సినిమాలో నటించకపోయినా.. ఆయన తెరవెనక ఉండి నడిపిస్తున్న సినిమాలలో వరుసగా హీరోయిన్గా ఎంపిక అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.