Movies"అరెరె..ఆ మూడు సినిమాలు నేను చేసి ఉంటే బాగుండేదే" అని.. బన్నీ...

“అరెరె..ఆ మూడు సినిమాలు నేను చేసి ఉంటే బాగుండేదే” అని.. బన్నీ ఫీలైన మూవీస్ ఇవే..!!

నిజానికి ఓ హీరో కొన్నిసార్లు కొన్ని మంచి మంచి కథలను మిస్ చేసుకోవాల్సి వస్తుంది . మన బన్నీ కూడా కొన్నిసార్లు అలాగే మంచి స్టోరీస్ ను మిస్ చేసుకున్నాడు. అందులో చాలా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూడు సినిమాలు నేను చేస్తే బాగుండేదే.. మిస్ అయిపోయాను అంటూ ఇప్పటికీ బన్ని బాధపడుతున్న ఆ మూడు సినిమాలు గురించి తెలుసుకుందాం..!!

భద్ర : రవితేజ హీరోగా మీరాజాస్మిన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మొదటగా హీరోగా అల్లు అర్జున్ ని అనుకున్నారట . అయితే కొన్ని కారణాల చేత అల్లు అర్జున్ ఈ సినిమా కథ నచ్చిన చేయకుండా ఆగిపోయాడు . అంతేకాదు దీనికోసం డైరెక్టర్ ఏకంగా ఆరు నెలల పాటు అల్లు అర్జున్ ఇంటి చుట్టూరే తిరిగారట డైరెక్టర్. అయినా సరే అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ఆయనకు బాధను కలిగిస్తుంది.

అర్జున్ రెడ్డి: ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన సినిమా . ఈ సినిమాని అల్లు అర్జున్ చేయకపోవడమే బెటర్ అంటూ పలువురు ఫాన్స్ కూడా కామెంట్స్ చేశారు . ఈ సినిమాల్లో ఉన్న లిప్ లాక్ కి భయపడిపోయి అల్లు అర్జున్ ఈ సినిమాను చేయకూడదు అంటూ డిసైడ్ అయిపోయారట. ఆ తర్వాత ఈ సినిమా విజయ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రిజల్ట్ చూసి బన్ని ఈ సినిమా చేసి ఉంటే బాగుండేదేమో అంటూ కూడా బాధపడ్డారట .

మిస్టర్ పర్ఫెక్ట్ : ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాను మొదటగా బన్నీకు వివరించారట. అయితే బన్నీ ఇది ఫుల్ టు ఫుల్ సెంటిమెంట్ స్టోరీ గా ఫీల్ అవ్వడంతో .. ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . అయితే ఈ మూడు సినిమాలు రిజెక్ట్ చేసి తప్పు చేశానే అంటూ చాలా చాలా బాధపడిపోయాడట బన్నీ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news