సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా వర్క్ చేస్తున్న వాళ్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం . ఆ లిస్టులో చాలామంది హీరో హీరోయిన్లు వస్తారు. కాగా అదే లిస్టులోకి వస్తారు అలియా భట్ – రన్బీర్ కపూర్ పెళ్లికి ముందు ఎలా తిరిగిన పెళ్లి తర్వాత మాత్రం చాలా పద్ధతిగా సాంప్రదాయాలను ఫాలో అవుతుంది ఈ జంట. అయితే రీసెంట్ గా ఆలియా భట్ తన భర్త రన్బీర్ కపూర్ – రష్మిక మందన్నా లిప్ లాక్ పై పరోక్షకంగా స్పందించింది .
అంతేకాదు కూసింత ఘాటుగానే ఇచ్చి పడేసింది . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అనిమల్ . ఈ సినిమా డిసెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాట చాలా హాట్ హాట్ గా అందర్నీ ఆకట్టుకునింది. మరీ ముఖ్యంగా రన్బీర్ – రష్మిక మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్స్ హైలెట్గా మారాయి.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రన్బీర్ – రష్మిక – అలియాలను బాగా ట్రోల్ చేశారు. అయితే దీనిపై పరోక్షకంగా స్పందిస్తూ ..అలియా భట్ “ఆ పాట చాలా చాలా బాగుంది “అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ” లూప్ లో ప్లే అవుతుంది” అంటూ తనకు పాట నచ్చిన విషయాన్ని బయటపెట్టింది . అయితే ఇది కేవలం సినిమా కోసమే అని ఇన్నర్ ఫీలింగ్ లో మాత్రం కడుపు రగిలిపోతూ ఉంటుందని తన భర్త వేరే అమ్మాయితో ముద్దు పెట్టుకుంటే ఏ భార్య చూసి సంతోషిస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!