నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా భగవంత్ కేసరి. బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమాకు తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే ఆడియన్స్ కి ఈ సినిమాలో సరికొత్త బాలయ్యని చూసినట్టు అనిపించింది. అయితే రెండో రోజు.. మూడో రోజు నుంచి సినిమా బాగా పుంజుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి దూసుకుపోతోంది.
ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య ఎనిమిది నెలల వ్యవధిలోనే దసరాకు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధించారు. ఇక బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ మూడు సినిమాల మొదటి వారం కలెక్షన్లు చూసుకుంటే ఏ సినిమా పై చేయి సాధించింది ? ఏసినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో చూద్దాం.
ఈ మూడు సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్లలో మొదటి స్థానంలో వీరసింహారెడ్డి నిలవడం విశేషం. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా రు. 114.95 కోట్ల గ్రాస్ అందుకుంది. సెకండ్ హైయెస్ట్ భగవంత్ కేసరి నిలిచింది. భగవంత్ కేసరి రెండు తెలుగు రాష్ట్రాల గ్రాస్ 112.18 కోట్లు ఉండటం విశేషం. ఇందులో దాదాపు రు. 60 కోట్ల వరకు షేర్ ఉంది.
అఖండ మూవీ తెలుగు రాష్ట్రాలలో 71.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే అందులో 45.11 షేర్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే 87.09 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఈ మూడు సినిమాలలో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వీరసింహారెడ్డి హిట్టు. భగవంత్ కేసరి ఇప్పుడే బ్రేక్ ఈవెన్ దాటింది. అఖండ అంత పెద్ద హిట్ అవ్వడం వెనక ఆ సినిమా బడ్జెట్, అమ్మిన రేట్లు చాలా తక్కువ… వసూళ్లు చాలా ఎక్కువ.