Newsఐశ్వ‌ర్యారాయ్ ప్రేమించి మోసం చేసింది... ఇన్నాళ్ల‌కు ఆ చేదు నిజం...

ఐశ్వ‌ర్యారాయ్ ప్రేమించి మోసం చేసింది… ఇన్నాళ్ల‌కు ఆ చేదు నిజం చెప్పిన వివేక్ ఒబెరాయ్‌..!

త‌న‌ పాత రిలేషన్లపై ఇదివరకే ఒకసారి మాట్లాడాడు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయి. అయితే ఈసారి దీనిపై మరింత సూటిగా స్పందించాడు వివేక్. గతంలో మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ సీనియర్ నటీమణి ఐశ్వర్యరాయ్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మరోసారి వివేక్ తన పాత బంధాల గురించి చెబుతూ పరోక్షంగా ఐశ్వర్యరాయ్ ను బ్లెయిమ్‌ చేశాడు.

ప్రతి బంధం ఒక పాటను నేర్పిస్తుంది.. మంచి లేదా ఒక దాన్ని అందిస్తుంది అయితే చెడు బంధాలు మరిన్ని పాఠాలు నేర్పిస్తాయి.. విషపూరిత బంధాలు మనలని బాగా మారుస్తాయి.. వీటికి దూరంగా ఉండటం మంచిది అని వివేక్ చెప్పాడు. రెండు దశాబ్దాల క్రిందట వివేక్.. ఐశ్వర్యరాయ్ తో ప్రేమాయణంలో ఉన్నాడు.. వీరిద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారు.. బహిరంగంగానే చట్టా పట్టాలు వేసుకొని తిరిగేవారు.. అయితే అంతకుముందే సల్మాన్ ఖాన్ తో ఐశ్వర్య ప్రేమలో పడింది.

వారిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు.. ఆ తర్వాత సల్మాన్ పెట్టే టార్చర్ భరించలేక అతడికి దూరమై వివేక్‌కు దగ్గర అయింది. అయితే తాను ఐశ్వర్యతో క్లోజ్ గా ఉండటంతో సల్మాన్ ఖాన్ పబ్లిక్ గా అవమానించాడు అంటూ ఒక దశలో వివేక్ ప్రకటించాడు కూడా..! అంతలోనే ఐశ్వర్య వివేక్ ని కూడా వదిలేసింది. దీంతో అతని గుండె బద్దలైంది. చాలా రోజులపాటు మానసిక వేదనతో ఉండిపోయాడు.

ఆ వెంటనే 2007లో ఐశ్వర్య.. అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. వివేక్‌ 2010లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇక ఐశ్వర్యతో తన ప్రేమ బంధం పై వివేక్ మాట్లాడుతూ తాను ప్రేమ బంధంలో ఉన్నప్పుడు ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నానని.. తనకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.. వాళ్లంతా తన పెళ్లికి కూడా వచ్చారు.. కొన్ని విషపూరిత బంధాలు మాత్రం నాకు గుణపాఠం నేర్పించాయని చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news