News' మ్యాడ్ ' సినిమా చూసిన ఎన్టీఆర్‌, ల‌క్ష్మీప్ర‌ణ‌తి... ఇద్ద‌రూ డిఫ‌రెంట్...

‘ మ్యాడ్ ‘ సినిమా చూసిన ఎన్టీఆర్‌, ల‌క్ష్మీప్ర‌ణ‌తి… ఇద్ద‌రూ డిఫ‌రెంట్ రివ్యూ ఇచ్చారే…!

లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ సినిమా ప్రేక్షకులకు ముందు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రు. 10 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా లాంగ్ రాన్లో అదిరిపోయే రికార్డులు సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా హీరో నార్నె నితిన్ ఎవరో కాదు ? టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు స్వయానా బావమరిది.

ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు నితిన్ ఇక ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్ ప్రమోషన్లు బాగా పనిచేసాయి. ఈ సినిమా ట్రైలర్ ఎన్టీఆర్ స్వయంగా రిలీజ్ చేయడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. ఆ తర్వాత మహేష్ బాబు.. విజయ్ దేవరకొండ ట్వీట్ చేసి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే విశ్వక్‌సేన్ కూడా సినిమా చూసి బాగుందని ట్విట్ చేశాడు. వీళ్ళందరూ కలిసి మ్యాడ్ సినిమాకు మంచి హైప్‌ తీసుకువచ్చారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ మ్యాడ్‌ సినిమాకు ఈ రోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ ఉందంటే అది డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వ‌ల్లే అని.. ఆయ‌న మ‌రిన్ని సూప‌ర్ హిట్లు కొట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. అలాగే ఈ సినిమా మా అక్క, బావ లక్ష్మీ ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ చూశారని బావకి సినిమా చాలా నచ్చింది.. అక్క‌కి అయితే డబుల్‌, ట్రిఫుల్‌… ఇంకా చెప్పాలంటే పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని నితిన్ తెలిపాడు.

ఇక అక్కా, బావ పిల్లలైతే నితిన్ మామ.. నితిన్ మామ అంటూ సినిమా అంతా బాగా ఎంజాయ్ చేశారని చాలా హ్యాపీగా చెప్పాడు. ఏది ఏమైనా మ్యాడ్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిదికి టాలీవుడ్ లో అదిరిపోయే లాంచింగ్ దక్కిందని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news