Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. "మురారి" మూవీకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో-హీరోయిన్లు వీళ్ళే..!!

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. “మురారి” మూవీకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో-హీరోయిన్లు వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు . పదేపదే చూడాలనిపిస్తూ ఉంటుంది . తరాలు మారిన జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోతున్నా సరే ఆ సినిమాలు ఎవర్ గ్రీన్ మూవీస్ గా అలాగే చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి సినిమాలలో ఒకటే మురారి. కృష్ణవంశీ దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది .

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది . అంతేకాదు మేకర్స్ కి ట్రిపుల్ స్థాయిలో లాభాలను క్రియేట్ చేసి పెట్టింది. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట . అయితే ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రలో విజయ్ దేవరకొండ సోనాలి బింద్రే పాత్రలో శ్రీలీలను చూస్ చేసుకున్నారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ తెలుస్తుంది . ఒకవేళ నిజంగా ఈ కాంబో సెట్ అయితే మాత్రం మురారి కి మించిన హిట్ అవుతుంది అంటున్నారు అభిమానులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news