లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా లియో. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజ్ అయింది. అసలు ఈ సినిమాపై కనివినీ ఎరిగిన రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ పై టైటిల్ విషయంలో పెద్ద వివాదం తలెత్తగా రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సినిమా ఆన్లైన్లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డి ప్రింట్ కావడంతో దళపతి విజయ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తర్కెక్కిన ఈ సినిమా పైరసీ సైట్స్ లో కనిపించడంతో సినిమా మేకర్స్ అంతా షాక్‌నకు గురయ్యారు. అయితే ఈ ప్రింటును వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ గట్టి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. తాజాగా లీక్ అయిన హెచ్చరి ప్రింట్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సినిమా నిర్మాతలు.
ఇక విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ సినిమా తర్వాత లియో వచ్చింది. సీనియర్ బ్యూటీ త్రిష – ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్.. మరో సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటించారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో రిలీజ్ చేసింది. ఈ సినిమా తెలుగు రైట్స్‌నే ఏకంగా రు. 22 కోట్లకు కొనుగోలు చేశారంటే ఇక్కడ కూడా ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలుస్తోంది.