కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో ? తెలియదు కానీ అప్పటినుంచి ఎన్టీఆర్ కెరియర్లో అనుహ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత కూడా దేవర సినిమా పట్టాలు ఎక్కేందుకు చాలా టైం పట్టింది. ఆచార్య డిజాస్టర్ అవడంతో కొరటాల పరువు మొత్తం గంగలో కలిసింది. దీంతో ఎన్టీఆర్ తో తెరకెక్కించే దేవర సినిమా కోసం సెట్స్ మీదకు వెళ్లకుండానే ఏడాదిన్నర టైం తినేసాడు కొరటాల.
ఈ సినిమా లేట్ అవ్వడంతో ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టులు కూడా బాగా డిలే అవుతున్నాయి. త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కొరటాల చేతికి వెళ్ళటం పెద్ద మలుపు. 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే ఆ రోజున రిలీజ్ ఏది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ 2 కూడా ఉంటుంది అని పెద్ద షాక్ ఇచ్చాడు కొరటాల. దేవర రెండు పార్టులుగా తీయటంలో ఎవరికి ? ఎలాంటి ఇబ్బంది లేదు.
అయితే దీనివల్ల ఎన్టీఆర్ లైన్ అఫ్ తారుమారు అవడంతో అభిమానుల్లో అయోమయం మొదలైంది.
నవంబర్ నెలకి దేవర షూటింగ్ కంప్లీట్ అయితే డిసెంబర్ నుంచి మార్చి వార్ 2 సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇప్పుడు దేవర 1, 2 పార్టీలుగా రిలీజ్ అవుతుందని చెప్పడంతో ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు అసలు ఎవరితో ? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఎన్టీఆర్ – కొరటాల కలిసి చేస్తున్న దేవర ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్ట్ ..మరి 31వ ప్రాజెక్ట్ అంటే వార్ 2 అవుతుందా ? లేదా దేవర 2 అవుతుందా లేదా ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు అవుతుందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఏది ఏమైనా కొరటాల శివ దేవర రెండు పార్టీలుగా రిలీజ్ అవుతుందంటూ కొరటాల ఇచ్చిన ట్విస్ట్‌లకు ఎన్టీఆర్ లైనప్ అయితే చెల్లాచెదురు అయిపోయిందని చెప్పాలి.