Newsశ్రీలీలని పిలుస్తూ కృతి శెట్టిని తరిమేస్తుంది ఆ ఒక్క కారణం వల్లేనా..?

శ్రీలీలని పిలుస్తూ కృతి శెట్టిని తరిమేస్తుంది ఆ ఒక్క కారణం వల్లేనా..?

మొదటి సినిమాతో భారీ హిట్ అందుకొని వరుస అవకాశాలు అందుకున్న కుర్రభామ ఇప్పుడు ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక ఎదురుచూస్తుంటే పెద్ద దర్శకుడి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా అనుకున్నంత సక్సెస్ కాని మొదటి సినిమా..ఆ తర్వాత ఊహించని స్థాయిలో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం ఒక్కో సినిమాకి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటూ హాట్ టాపిక్ అవుతోంది.

వారే కృతీశెట్టి, శ్రీలీల. ఉప్పెన సినిమాతో దూసుకొచ్చిన కృతిశెట్టి ఆ తర్వాత వరుసగా శ్యాం సింగరాయ్, బంగార్రాజు, మచర్ల నియోజక వర్గ్మ, ది వారియర్ లాంటి సినిమాలు చేసింది. వీటిలో బంగార్రాజు తప్ప మిగతావు సో సోగా ఆడాయి. దాంతో కృతీశెట్టికి కాస్త క్రేజ్ తగ్గిపోయింది. అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ బ్యూటీని తమ సినిమాలలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే బాగా ఆలోచిస్తున్నారు మేకర్స్.

కానీ, శ్రీలీల విషయంలో అలా కాదు. అమ్మడికి లక్ తో పాటు సక్సెస్ లు, కాస్ట్ బాగా కలిసొస్తున్నాయి. ధమాకా ఒప్పుకున్నప్పుడు కామెంట్స్ చేసిన వారే తర్వాత పొగడ్తలతో ముంచేశారు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా శ్రీలీల రేంజ్ ని మరింత పెంచేసింది. అటు మెగా హీరోలను ఇటు నందమూరి హీరోలను ఆకట్టుకున్న శ్రీలీల మరో రెండేళ్ళ వరకూ ఖాళీ లేకుండా డైరీ నింపేసింది. ఇప్పుడు తమ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల కావాలంటే 6 నెలలైనా ఆగాల్సిందే.

దానికి కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల తప్ప మరో ఛాయిస్ కనిపించడం లేదు. అటు రష్మిక మందన్న, ఇటు పూజా హెగ్డేలకి దక్కాల్సిన అవకాశాలు కూడా శ్రీలీల ఖాతాలో పడుతున్నాయి. ఇక కుర్ర హీరోయిన్స్ అయిన కేతిక శర్మ, నేహ శెట్టి లాంటి వారైతే స్టార్స్ పక్కన ఛాన్స్ అంటే కలలు కనాల్సిందే. శ్రీలీల లో ఏముందో మేకర్స్ కి ఏమి చూపించిందో గానీ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ తో మాత్రం అల్లాడిస్తుంది. దానివల్ల నిర్మాతలు మాకు శ్రీలీల మాత్రమే కావాలని డిసైడయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news