టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు ..స్టార్ హీరోలుగా మారుతున్నారు..పాన్ ఇండియా హీరోలుగా మారి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటున్నారు . కానీ అందరిలోకి చాలా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . సినిమా ఇండస్ట్రీలోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలామంది స్టార్ డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉండడానికి మెయిన్ రీజన్ ఆయన చెప్పిన టయానికి వస్తాడు ..షూట్ కంప్లీట్ చేసుకుంటాడు ..ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడు అని అందరూ చెబుతూ ఉంటారు .

అయితే చాలామంది డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.. కానీ తారక్ కి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ అంటే మహా మహా ఇష్టం. ఆయన ఎప్పుడు అడిగినా సరే కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారట . స్వయాన ఈ విషయాన్ని ఆయనే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. కానీ ఆ డైరెక్టర్ కు కూఇసంత.. మెంటల్ తిక్క అంటూ కూడా చెప్పుకు వచ్చారు. ఇప్పటికే ఆ డైరెక్టర్ ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. యస్..ఆయనే ఎస్ ఎస్ రాజమౌళి.

వీళ్లని డైరెక్టర్ హీరోలు అనడం కన్నా మంచి ఫ్రెండ్స్ అనడం చాలా చాలా వినడానికి బాగుంటుంది. వీరిద్దరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి . నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ గా మారింది. స్టూడెంట్ నెంబర్ వన్ – సింహాద్రి- యమదొంగ – ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ సినిమాలు వీళ్ళ కాంబోలో వచ్చి సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ రికార్డ్స్ ను క్రియేట్ చేశాయి .

కాగా తారక్ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశానని ..కానీ రాజమౌళితో వర్క్ చేసినప్పుడు వచ్చే ఫ్రస్టేషన్ ..కోపం.. ప్రెజర్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ తెచ్చుకున్నాక పోతుంది అని .. ఆ డైరెక్టర్ ఎంత మంచోడో.. అంత తిక్కలోడు అని కూడా కామెంట్ చేశారు. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్లో తారక్ – చరణ్ లని చాలా చాలా ఇబ్బంది పెట్టాడు రాజమౌళి అంటూ ఓపెన్‌గానే ఆయన ముందే చెప్పుకొచ్చాడు. ప్రెసెంట్ రాజమౌళి గురించి తారక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.