టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ యేడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వేరే సినిమా సూపర్ హిట్ అవ్వగా తాజాగా వచ్చిన భోళాశంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేదు. ప్రస్తుతం చిరంజీవి మోకాలికి చిన్నపాటి శాస్త్ర చికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇక చిరంజీవి కెరీర్లో 157వ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుష్మిత నిర్మించే సినిమా తర్వాత ఈ 157వ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం నడుస్తోంది.
ఈ సినిమా కూడా దర్శకుడు వశిష్ తొలి సినిమా లాగా షోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఒక హీరోయిన్గా సంయుక్త మీనన్ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారు.
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా టీం స్క్రిప్ట్ పనులలో బిజీబిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.