Moviesనాగ‌చైత‌న్య‌తో అనుష్క పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది…!

నాగ‌చైత‌న్య‌తో అనుష్క పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది…!


టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తాజాగా మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. తెలుగులో అనుష్క తొలి సినిమా సూపర్ హీరో నాగార్జున అనుష్క జోడి కి తిరుగులేని క్రేజ్ ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

అనుష్క – నాగార్జున కాంబినేషన్ అంటే చాలు తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టి మరి సినిమాలు చూసేవారు. అయితే చివరలో అనుష్కకు నాగార్జునకు మధ్య ఏదో తేడా వచ్చిందని.. అందుకే అనుష్క నాగార్జున దూరం పెట్టాడన్న ప్రచారం కూడా ఇండస్ట్రీలో అయితే ఉంది. నాగార్జున – అనుష్క మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న ప్రచారం కూడా అప్పట్లో బాగా జరిగింది.

విచిత్రం ఏంటంటే నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు అనుష్కకు మధ్య పెళ్లి జరగబోతుంది అన్న వార్త అప్పట్లో తెలుగు మీడియాను షేక్ చేసింది. ప్రముఖ మీడియాలో కూడా ఈ వార్త రావడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో అనుష్కతో నాగచైతన్య పెళ్లి జరగబోతుందని.. దీనికి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్త వచ్చింది.

ఆ తర్వాత నాగర్జున లాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వడంతో ఆంధ్రజ్యోతి తన వార్తకు ఖండన‌ను కూడా ఇచ్చుకుంది. ఆ తర్వాత నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్‌ సమంతతో ప్రేమలో పడి నాలుగేళ్ల కాపురం తర్వాత విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news