Newsత‌మ పేర్ల‌తోనే సినిమాలు తీసిన స్టార్ హీరోలు.. ఆ సినిమాల్లో ఎవ‌రు...

త‌మ పేర్ల‌తోనే సినిమాలు తీసిన స్టార్ హీరోలు.. ఆ సినిమాల్లో ఎవ‌రు హిట్‌… ఎవ‌రు ఫ‌ట్‌…!

సినిమాకు కథ‌ ఎంత ముఖ్యమో టైటిల్ కూడా అంతకంటే ఎక్కువ అని చెప్పాలి. ఒక సినిమా ప్రజల్లోకి వెళ్లాలంటే టైటిల్ చాలా ముఖ్యం. టైటిల్ చూసి ఆడియన్స్.. ఆ సినిమా జోనర్ ఏమిటో దాని కథ ఏమిటో ?ఒక అంచనాకు వస్తారు. ఒకరకంగా చెప్పాలంటే స్టోరీతో పనిలేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే రేంజ్ టైటిల్‌కు ఉందని చెప్పాలి. అందుకే టైటిల్స్ విషయంలో సినిమా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

టైటిల్ కోసమే చాలా సమయం వేస్ట్ చేయడంతో పాటు.. లక్ష రూపాయల ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. ఇక స్టార్ హీరోల సినిమాలకు కూడా టైటిల్ పెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని సినిమాలకు స్టార్ హీరోలు తమ సొంత పేరుని టైటిల్ గా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెలుగులో టాప్ హీరోలుగా ఉన్న నాగార్జున – చిరంజీవి తమ కెరీర్ లో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారే.

1980 న్యాయం కావాలి – ఖైదీ లాంటి సూపర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు చిరంజీవి. ఈ క్రమంలోనే సివి రాజేంద్రన్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 1985లో చిరంజీవి అనే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది. విజయశాంతి హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక మరో అక్కినేని హీరో నాగార్జున కూడా తన పేరుతో ఒక సినిమా విడుదల చేశారు. ఆయన 1986లో వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కెప్టెన్ నాగార్జున సినిమా చేశారు.

కుష్బూ హీరోయిన్గా నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. ఇలా ఇద్దరు హీరోలు తమ పేర్లతో తీసిన సినిమాలు ప్లాపులుగా నిలిచాయి. ఇక బాలకృష్ణ తన పేరుతో సినిమా చేయలేదు గాని.. తనకు అభిమానులు ఇచ్చిన యువరత్న టైటిల్ తో ఒక సినిమా చేశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన యువరత్న రాణా బాక్సాఫీస్ దగ్గర హిట్ సినిమాగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news