సినిమా ఇండస్ట్రీలో ఎన్ని జంటలు ఉన్నా క్రికెటర్ విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మల కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి . అసలు ఈ జంటకు ఎలా ప్రేమ కుదిరిందో ..ఎవరికి అర్థం కావడం లేదు . ఒకరేమో ముఖానికి రంగులు పూసుకుని తెరపై నటించే మనిషి .. మరొకరేమో చెమటలు కార్చుకుంటూ గ్రౌండ్లో క్రికెట్ ఆడే బ్యాట్స్ మ్యాన్.. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది..? అనేది ఇప్పటికీ అభిమానులకు ప్రశ్నార్ధకంగానే ఉంది.
అయితే ప్రేమ ఎప్పుడూ..? ఎవరికీ ..? ఎలా పుడుతుందో తెలియదు అంటారుగా ..మేబీ వీళ్ల విషయంలో అదే జరిగిందేమో. 2017లో ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత వీళ్ళకి వామిక.. అనే బేబీ కూడా పుట్టింది. కాగా రీసెంట్గా వినాయక చవితి సెలబ్రేషన్స్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ చాలా పద్ధతిగా చేసుకున్నారు . విరాట్ వైట్ కలర్ కుర్తాలో అదిరిపోయే రీతిలో కనిపిస్తే.. అనుష్క శర్మ కుందనపు బొమ్మలాగా కాంచివరం బిగ్ బార్డర్ పట్టు చీరలో మహాలక్ష్మి లా కనిపించింది .
అయితే అభిమానులకు మాత్రం ఓ విషయంలో వెలితిగా అనిపించింది .. ఈ ఫొటోస్ లో వామిక లేదు .. అసలు వామిక పుట్టి వన్ ఇయర్ అయిపోతున్న ఎప్పుడు చూపిస్తారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మా కోహ్లీ కూతుర్ని చూడాలని మాకు ఉంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు . కనీసం పండగ పూట కూడా మాకు చూపించరా..? అంటూ అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ అనుష్క శర్మల పేర్లు వైరల్ గా మారాయి..!!