రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిస్క్ చేస్తున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఆయన ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలింగ్ ను వ్యక్తపరుస్తున్నారు. ఎప్పటినుంచో హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత చాలా చాలా టైం గ్యాప్ తీసుకున్నాడు . అంతేకాదు ఖుషి సినిమాతో యావరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఈ సినిమా హిట్ అయినా సగం సమంత సగం క్రెడిట్ విజయ్ దేవరకొండ ఖాతాలో పడింది .’
అయితే ఇలాంటి టైంలోనే పరశురాం – విజయ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను ఓ యంగ్ డైరెక్టర్ తో చేస్తూ ఉండడం ఇప్పుడు వైరల్ గా మారింది . అది కూడా ఫేమ్ లేని డైరెక్టర్ తో కావడం గమనార్హం.. రాజా వారు రాణి గారు సినిమాను తెరకెక్కించిన కిరణ్ తో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నారట .
ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడట . అయితే విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ కి ఈ డైరెక్టర్ అసలు మ్యాచ్ అవ్వడు. మరి ఎందుకు విజయ్ దేవరకొండ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు విజయ్ దేవరకొండ తన కష్టాలను తానే కొని తెచ్చుకుంటున్నాడు అంటూ కూడా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నాడు . చూద్దాం మరి విజయ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?