Movies"ఖుషి" సినిమాకి డబ్బులిచ్చి మరి ఫేక్ రివ్యూలు రాయిస్తుంది ఆ అవార్డ్...

“ఖుషి” సినిమాకి డబ్బులిచ్చి మరి ఫేక్ రివ్యూలు రాయిస్తుంది ఆ అవార్డ్ విన్నింగ్ హీరోనేనా..? స్టేజీ పై ఇచ్చిపడేసిన విజయ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో స్టార్ హీరోగా మారకుండా మరో హీరో తోకేస్తున్నాడా..? అంటే రీసెంట్గా విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు బట్టి అది నిజమే అని అర్థమవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఖుషి . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టింది .

రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 70 కోట్లు క్రాస్ చేసి సంచలనానికి తెరలేపిన ఖుషి..త్వరలోనే 100 కోట్లు క్రాస్ చేస్తుంది . సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈవెంట్లో మాట్లాడాడు . ఈ ఈవెంట్లు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చాలా అద్భుతంగా ప్రసంగించారు . ఆయన మాట్లాడుతూ ..”ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తుంది.. నేను ఇంట్లో ఉన్నా కూడా మీ ప్రేమను ఫీల్ అవుతున్నాను .. అయితే ఎవరో నా మీద అటాక్స్ చేయించడానికి చూస్తున్నారు ..మా ఖుషి మీద ఫేక్ బి ఎం ఎస్ రేటింగ్స్ యూట్యూబ్ వీడియోలు చేయిస్తున్నారు. వేలాది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి యూట్యూబ్ వీడియోలు సర్కులేట్ చేస్తున్నారు. ఇదంతా కొందరు డబ్బులు ఖర్చు చేసి చేస్తున్నారు . అవన్నీ దాటుకొని మీ ప్రేమ అభిమానాలను సొంతం చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది . ఖుషి సక్సెస్ అందుకోవడానికి మెయిన్ రీజన్ మీరే.. మూడు రోజుల నుంచి చూస్తున్న మీ ఫేస్ లో సంతోషాన్ని చూసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది”అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పేరు మారుమ్రోగిపోతుంది. అంతేకాదు అసలు విజయ్ దేవరకొండ సినిమాకు ఫేక్ రివ్యూస్ డబ్బులు ఇచ్చి చెప్పించాల్సిన అవసరం ఏ హీరోకి ఉందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. కొంతమంది విజయ్ దేవరకొండ అంటే మొదటి నుంచి ఓ హీరో అంటే పడదని ..ఆ హీరో అవార్డు కూడా అందుకున్నాడని .. ఆ అవార్డు విన్నింగ్ హీరోనే విజయ్ దేవరకొండ ఎక్కడ సక్సెస్ అయితే తన స్టార్ డం పోతుందో అని ఇలా ఫేక్ రివ్యూస్ డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఎలాంటి వాళ్ళనైనా కొనగలిగే సత్తా ఆ హీరోకి ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చెప్పిన హీరో ఇతగాడే అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news