Moviesఫ్యాన్స్ కుటుంబాలకు కోటి రూపాయలు.. విజయ్ దేవరకొండ తల్లి ఊహించని రియాక్షన్..రౌడీ...

ఫ్యాన్స్ కుటుంబాలకు కోటి రూపాయలు.. విజయ్ దేవరకొండ తల్లి ఊహించని రియాక్షన్..రౌడీ హీరో మదర్ అని ప్రూవ్ చేసిందిగా..!! !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఖుషి . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది . సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే తనకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన అభిమానులకు బదులుగా విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ లో నుంచి కొంత భాగాన్ని తీసి తన ఫ్యాన్స్ కుటుంబాలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

రీసెంట్గా ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇదే కామెంట్స్ చేశారు. . కోటి రూపాయలు 100 కుటుంబాలకు షేర్ చేస్తానని త్వరలోనే ఆ డీటెయిల్స్ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు అయితే దీనిపై విజయ్ దేవరకొండ తల్లి షాక్ అయిపోయిందట . నిజానికి విజయ్ దేవరకొండ ముందు నుంచి డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే మనిషి అని .. ఇలా అభిమానుల కోసం డబ్బులు ఖర్చు పెడతారని ఆమె ఊహించలేకపోయిందట.

కానీ అలా డబ్బులు ఖర్చు చేయడం చాలా మంచి పద్ధతి అని ..మనకు ఇంత హిట్ ఇచ్చిన అభిమానులకు మనం కూడా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ..అలాంటి బిడ్డ నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని ఆమె హ్యాపీగా ఫీల్ అయిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్అవుతుంది. అయితే చాలామంది విజయ్ దేవరకొండను మరీ ఓవర్ చేస్తున్నాడు అంటూ తిడుతున్నా ఆయన ఫ్యాన్స్ మాత్రం ఇది రియల్ హీరో కి ఉండాల్సిన లక్షణం అంటే అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news