Moviesసమంత-విజయ్ దేవరకొండ "ఖుషీ" మూవీ ట్విట్టర్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

సమంత-విజయ్ దేవరకొండ “ఖుషీ” మూవీ ట్విట్టర్ రివ్యూ: హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత జంటగా కలిసి నటించిన సినిమా ఖుషి . నిన్ను కోరి – మజిలీ లాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ కధను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . కొద్దిసేపటికి గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది .

ఈ సినిమాలో ఓ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ రియాలిటీగా చూపించి పెద్ద సాహసమే చేశాడు శివ నిర్వాణ. కాగ సినిమా కథ కొత్తది కాదు.. ఆల్రెడీ ప్రతి ఇంట్లో జరిగే కదే ..కానీ ఆ ప్రాబ్లమ్‌స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న విషయం శివనిర్వాణ క్లియర్ గా చూపించాడు . మరీ ముఖ్యంగా భార్యాభర్తల పాత్రల్లో విజయ్ దేవరకొండ సమంత లీనమైపోయి నటించారు . ఈ సినిమాకి వాళ్ళ నటన హైలైట్ గా మారుతుంది .

అయితే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. తెరపై సీన్స్ ఎంత చక్కగా ఉన్నాయో దానికి తగ్గట్టే చాలా సాఫ్ట్ గా మ్యూజిక్ కూడా ఉండడం ..ఈ సినిమా హిట్ అవడానికి కారణం అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . మరి ముఖ్యంగా కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా ఫెయిల్ అయ్యాయని.. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కామన్ డైలాగ్స్ ను చాలా ఫన్నీగా రాసుకొచ్చాడని చెప్పుకొస్తున్నారు జనాలు. అంతేకాదు ఈ సినిమాలో సమంత నటన ఇంకా ఇంకా బాగుందని ..లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత హిట్ కోసం కాపు కాస్తున్న విజయ్ దేవరకొండకు ఇది ఓ మంచి సాలిడ్ హిట్ అని.. గీతగోవిందం తర్వాత అలాంటి హిట్ అందుకున్న సినిమా ఇదే అని చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఖుషి సినిమా టాక్ వైరల్ గా మారింది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news