మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటోనీ కూతురు మీరా తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది . కాగా గత కొంతకాలంగా డిప్రెషన్ కి గురవుతున్న ఆమె ఆరోగ్యపరంగా పలు మందులు తీసుకుంటుంది అంటూ కూడా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఆమె తీవ్రమైన డిప్రెషన్ కి లోనైన కారణంగా ఏం చేస్తుందో తెలియని పొజిషన్లో సూసైడ్ చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి .
ఇలాంటి క్రమంలోనే కూతురు చనిపోయిన తర్వాత విజయ్ అంటోని సోషల్ మీడియా వేదికగా ఆమె మరణానికి సంబంధించి సంచలన కామెంట్స్ చేశారు . దీంతో ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా విజయ్ అంటోని ఓ నోట్ ని షేర్ చేశారు . “డియర్ హార్ట్స్.. నా కూతురు మీరా దయామయురాలు ..ధైర్యవంతురాలు . ఆమె ఇప్పుడు కులం – మతం- డబ్బు -బాధ -పేదరికం – ద్వేషం లేని ఓ పీస్ ఫుల్ లోకంలోకి వెళ్లిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది . కానీ ఆమె నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఆమెతో పాటు నేను కూడా చనిపోయాను . నేను ఇప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను . ఆమె ప్రారంభించిన మంచి పనులు అన్నిటిని తన పేరు మీద నేనే పూర్తి చేస్తాను ” అంటూ చాలా ఎమోషనల్ గా నోట్ రాసుకోచ్చాడు విజయ్ అంటోని .
దీనిపై ఆయన అభిమానులు సైతం స్పందిస్తూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు . అయితే ఎందుకు మీరా సూసైడ్ చేసుకున్నింది..? అన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు . పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా..? లేదా..? ఆమెకు ఆమెను సూసైడ్ చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా..? అన్న విషయం పై పోలీసులు విచారణ చేస్తున్నారు..!!