కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా .. తన ఇంట్లో సూసైడ్ చేసుకొని మరణించింది. కాగా ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు . మీరా 12వ తరగతి చదువుతుంది . అయితే ఆమె స్ట్రెస్ కారణంగానే ఇలా సూసైడ్ చేసుకొని ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .
కాగా ఇలాంటి క్రమంలోనే మీరా సూసైడ్ చేసుకున్న మూమెంట్లో గతంలో విజయ్ ఆంటోనీ సూసైడ్స్ పై మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో విజయ్ ఆంటోని ..”పెద్దవాళ్లు సూసైడ్ చేసుకోవడానికి చాలా చాలా కారణాలు ఉంటాయని.. లవ్ బ్రేకప్స్.. ఫైనాన్షియల్ ఇష్యూస్.. నమ్మించి నమ్మి మోసపోవడం.. ఇలా ఎన్నో ఉంటాయని .. కానీ పిల్లలు విషయానికి వచ్చేసరికి కేవలం చదువు స్ట్రెసే ఉంటుందని .. ఎక్కువ చదవండి.. ఇలా చదవండి అని పిల్లలపై ప్రెజర్ పెట్టొద్దు అని ..మరీ ముఖ్యంగా స్కూలింగ్ అయిపోయిన తర్వాత బోర్డ్ ఎడ్యుకేషన్ కి వచ్చాక వాళ్ళపై అస్సలు ఫోర్స్ తీసుకురావద్దని చెప్పుకొచ్చారు”.
అయితే ఇదే క్రమంలో విజయ్ కూతురు అలాంటి సూసైడ్ చేసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్ని నీతి వ్యాఖ్యలు చెప్పిన విజయ్ తన కూతురి విషయంలో మాత్రం సామాన్య తండ్రిలానే ప్రవర్తించాడా ..? అందుకే ఆమె ఆ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందా..? అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . చూడాలి మరి దీనిపై విజయ్ ఆంటోని ఎలా రియాక్ట్ అవుతాడో..?