Newsవెంక‌టేష్ - మ‌హేష్ మరో మ‌ల్టీస్టార‌ర్‌... టైటిల్ ఇదే..!

వెంక‌టేష్ – మ‌హేష్ మరో మ‌ల్టీస్టార‌ర్‌… టైటిల్ ఇదే..!

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ మహేష్ బాబు – వెంకటేష్ హీరోలుగా 2013 సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇద్దరు పెద్ద హీరోలని పెట్టి ఇలాంటి కథతో మల్టీస్టారర్ సినిమా చేయొచ్చు అని నిరూపించిన ఘనత శ్రీకాంత్ అడ్డాలకు దక్కుతుంది. ఈ సినిమాకు కల్ట్ అభిమానులు ఉన్నారు. ఇందులో డైలాగులు, పాటలు, హీరోల అనుస్క్రీన్‌ కెమిస్ట్రీ అన్నీ సూపర్ హిట్. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత.

అంజ‌లి – సమంత హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు పెద్ద హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ ఇలాంటి సినిమా తెరకెక్కించటం ఎలాంటి గొప్ప దర్శకుడికి అయిన కత్తి మీద సామూలాంటిదే. మరి ఇలాంటి హిట్ సినిమాకు పార్ట్-2 తీస్తే ఎలా ? ఉంటుంది.. ఈ ఐడియా నిర్మాత దిల్ రాజుకే వచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సీక్వెల్ చేద్దామంటూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దగ్గర ప్రపోజల్ పెట్టారట దిల్ రాజు.

ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా బయటపెట్టారు. అయితే ఆ సినిమాకు పార్ట్-2 చేయాలి అంటే మళ్ళీ ఆ కాంబినేషన్ కుదరాలి.. ఆ క్రేజ్ కొనసాగించాలంటే దానికి తగ్గ కథ సెట్ అవ్వాలి కదా.. వర్క్ అవుట్ అయితే చెబుతానని తాను దిల్ రాజుకు చెప్పాన‌ని శ్రీకాంత్ తెలిపారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల‌ దర్శకత్వంలో పెదకాపు 1 సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలోనే మహేష్ – వెంకటేష్ కాంబినేషన్లో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు 2 తీసే ఆలోచన ఉన్న విషయాన్ని బయట పెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news