Moviesబిగ్ బాస్ 7: ఊహించని కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున.....

బిగ్ బాస్ 7: ఊహించని కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసిన నాగార్జున.. బయటకి వచ్చాక ఉల్టా పల్టానే..!?

తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్బాస్ సీజన్ సెవెన్ నిజంగానే ఉల్టా పల్టాగా ముందుకెళ్తుంది . షో స్టార్టింగ్ లోనే నాగార్జున చెప్పినట్లు ఈసారి ఎవరి ఊహలకు అందని విధంగా షోను డిజైన్ చేశామని.. షో ఉండబోతుంది అంటూ ముందుగానే చెప్పుకొచ్చారు . అయితే ఆయన చెప్పినట్లే షోలో అసలు ఏం జరుగుతుంది ..? ఎందుకు జరుగుతుంది..? అనే విషయాలు తెలియకుండా జనాలకు పిచ్చి ఎక్కిస్తున్నారు. మరి ముఖ్యంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా దానికి తగ్గట్టే ఉల్టా పల్టాగా బిహేవ్ చేస్తున్నారు.

కాగా గతవారం బిగ్బాస్ హౌస్ లో తెలుగు రాని కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే . కాగా ఈవారం ఇద్దరి టాప్ కంటెస్టెంట్ల మధ్య ఓటింగ్ ఎక్కువగా జరిగిందని ఫైనల్లీ బిగ్ బాస్ అనుకున్న ప్రకారమే ఓట్లు ఎక్కువ వచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి మరోసారి బిగ్ బాస్ అని ప్రూవ్ చేసుకున్నాడు అని సోషల్ మీడియాలో జనాలు విపరీతంగా ఫైర్ అవుతున్నారు . ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి షకీలా అవుట్ అయినట్లు తెలుస్తుంది .

అందరికన్నా తక్కువగా షకీలా ..టేస్టీ తేజకు ఓట్లు రాగా హౌస్మేట్స్ సహాయంతో షకీలాను ఇంటి నుంచి బయటికి పంపించేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు నిజానికి షకీలా కన్నా టేస్టీ తేజకు తక్కువ ఓట్లు వచ్చాయట . కానీ బిగ్ బాస్ షకీల ఇంట్లో ఉండడంతో టిఆర్పి రేటింగ్స్ ఏం పెద్దగా పెరగటం లేదని.. చాలా సైలెంట్ గా ఉంటుందని ఆ కారణంగానే ఆమె హౌస్ లో ఉన్నా మనకి టిఆర్పి లో విషయంలో ఒరిగేది ఏం లేదు అంటూ ఓట్లు ఎక్కువ వచ్చిన ఎలిమినేట్ చేశారట. బిగ్బాస్ పై షకీల ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు ఇద్దరు టాప్ కంటెస్టెంట్ లని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నట్లు సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news