Moviesప్ర‌భాస్ - మారుతి సినిమాకు రెండు టైటిళ్లు… ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయే…!

ప్ర‌భాస్ – మారుతి సినిమాకు రెండు టైటిళ్లు… ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయే…!

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్తో ఓ భారీ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రభాస్ టైప్ యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే కామెడీ డ్రామా అని తెలుస్తోంది. ప్రభాస్ క్యారెక్టర్ పై మరో సరికొత్త రూమర్ కూడా వినిపిస్తోంది.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ కి ఒక వీక్నెస్ ఉంటుంది అని… ఆ వీక్‌నెస్ ఆధారంగానే ఈ సీక్వెన్స్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఎలాంటి ? ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.

సహజంగానే మారుతి అంటేనే చిన్న చిన్న పాత్రలతో ఫుల్ కామెడీ పండిస్తాడు. ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్‌ కామెడీని పండిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా కోసం రాయల్ – అంబాసిడర్ అనే టైటిళ్ల‌ను పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే సినిమా మేకర్స్ మాత్రం రాయల్ టైటిల్ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news