మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అదే టైంలో చాలా స్క్రిఫ్ట్‌లకు డైలాగులు కూడా రాసేవారు. ఆయన మొదట డైలాగ్ రైటర్‌గా నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమాకి పనిచేశారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలి సినిమాకి డైలాగులు రాశారు.
అనంతరం వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాకు కథ, మాటలు ఇచ్చారు. అక్కడి నుంచి త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ముఖ్యంగా విజయభాస్కర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే నిలిచింది. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ కి మంచి పేరు ఉండేది. ఆ తర్వాత త్రివిక్రం తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. దీంతో మహేష్ బాబు హీరోగా అతడు సినిమా చేశాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం నమోదు చేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌హీరోగా త్రివిక్రమ్ చేసిన జల్సా కూడా సూపర్ హిట్. అయితే త్రివిక్రమ్ తన కెరీర్‌లో ఒక సినిమాకు పాటలు కూడా రాశారు. ఆ సినిమా ఏదో కాదు రవితేజ – నమిత హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఒక రాజు ఒక రాణి.
ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాకు యోగి దర్శకత్వం వహించారు. ఇక త్రివిక్రమ్ ఫస్ట్ టైం చివరి సారిగా పాటలు రాసిన సినిమా అదే కావడం విశేషం. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ అవ్వడంతో త్రివిక్రమ్‌కు ఆ ఛాన్సే రాకుండా పోయింది.