మీటర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యంగ్ బ్యూటీ అతుల్య రవి.. మారుతున్న కల్చర్ పెళ్లికి ముందే శృంగారం గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి, మీటర్ సినిమా తర్వాత అతుల్యకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.
అయితే తమిళం మాత్రం ఆమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం కోలీవుడ్లో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ రీసెంట్గా తన పర్సనల్ లైఫ్ తో పాటు కెరియర్ గురించి మాట్లాడింది. నేను దేని గురించైనా నిర్మొహమాటంగా నా అభిప్రాయాలు వ్యక్త పరుస్తా.. మనసులో దాచుకుని మదనపడను.. సినిమాలో ఎంపికలోను అంతే..! అలాగే నేటి యువతలో సహజీవనం చేసే వారి సంఖ్య పెరుగుతుంది.. దీంతో రిలేషన్లు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.. నా దృష్టిలో సహజీవనం అనేది వ్యక్తిగత విషయం. పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్థించను.. ఇది మన భారతీయ సంస్కృతి విరుద్ధం. అది కావాలనుకుంటే పెళ్లి చేసుకోవడం ఉత్తమం అని చెప్పింది.
అతుల్య రవి ఇక ప్రేమలో ఉన్న వారు జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది అని.. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే తన అభిప్రాయం అని తన మనసులో ఉన్న మాట కొండ బద్దలు కొట్టింది. తాజాగా ఆమె చేస్తున్న ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.