టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. బాలనటుడిగానే కెరీర్ ప్రారంభించిన మహేష్ 1999లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాయే సూపర్ హిట్. ఆ వెంటనే మహేష్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రెండో సినిమాగా యువరాజు వచ్చింది.
ఈ సినిమాలో సిమ్రాన్ – సాక్షి శివానంద్ హీరోయిన్లుగా నటించారు. అయితే అప్పటికే వయసులో సిమ్రాన్, సాక్షి శివానంద్ మహేష్ కంటే కాస్త పెద్దగా కనిపించారు. పైగా ఈ సినిమా కథ, కథనాలు మహేష్ కు అంతగా సూట్ కాలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. అప్పటికి మహేష్ బాబును తెలుగు సినీ ప్రేక్షకులు.. ఘట్టమనేని అభిమానులు అందరూ ఒక లవర్ బాయ్ గా ఊహించుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ పెళ్లయి ఒక బిడ్డకు తండ్రిగా నటించాడు. దీనిని ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు.
పైగా ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన సిమ్రాన్ – సాక్షి శివానంద్ ఇద్దరు కూడా పెద్ద ఆంటీలుగా ఉన్నారన్న విమర్శలు వచ్చాయి. లవర్ బాయ్ లాంటి మహేష్ పక్కన ఆంటీ హీరోయిన్లను ఎందుకు ?పెట్టారు రా బాబు అని మహేష్ అభిమానులు సైతం అప్పట్లో తలలు బాదుకున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లు మహేష్ పక్కన ఎంత మాత్రం సూట్ కాలేదు.
యువరాజు సినిమాలో ఎమోషన్ తో పాటు పాటలు బాగున్నా.. నేపథ్య సంగీతం చక్కగా కుదిరినా మహేష్ కు సూట్ కాని కథ, మహేష్ పక్కన సరిగా సెట్ అవ్వని హీరోయిన్లు ఈ సినిమాకు మైనస్ అయ్యారు. అందుకే ప్రేక్షకులను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. అయినా కూడా మహేష్ ఇమేజ్ తో ఆ రోజుల్లోనే యువరాజు 17 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది.