Newsచిరు ' జ‌గ‌దేగ‌వీరుడు అతిలోక‌సుంద‌రి 2 ' స్టోరీ ఇదే...!

చిరు ‘ జ‌గ‌దేగ‌వీరుడు అతిలోక‌సుంద‌రి 2 ‘ స్టోరీ ఇదే…!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకుల‌ అంచనాలు ఏమాత్రం అందుకోలేదు. చిరు కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. చిరు పెద్ద కుమార్తె కొణిదల సుష్మిత నిర్మించే సినిమాకు కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వం వహిస్తారు. ఇక యువీ క్రియేషన్స్ నిర్మించే సినిమాకు బింబిసార‌ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకుడు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 157వ‌ సినిమాగా తెరక్కెక్కనుంది.

ఈ సినిమా కాన్సెఫ్ట్ పోస్ట‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యి మంచి బ‌జ్ తెచ్చుకుంది. తాజాగా దర్శకుడు వశిష్ట ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెగాస్టార్ తో తాను తెర‌కెక్కించే సినిమా షోషియో ఫాంటసి జాన‌ర్‌లో సాగుతూ మెగా ఫ్యాన్స్ తో పాటు… నార్మల్ ఆడియన్స్‌ను కూడా చాలా ఆకట్టుకుంటుంది అని.. కొన్నేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి స్టైల్ లో ఈ సినిమా కథ ఉంటుందని వశిష్ఠ్‌చెప్పేశాడు.

జగదేకవీరుడు సినిమా వచ్చిన టైంలో అప్పటి జనరేషన్ వారు అందులో ఆయన పాత్రను ఎలా ?ఇష్టపడ్డారో.. ఈ తరం జనరేషన్ వారు ఈ సినిమాలో చిరు పాత్రను అంతేలా ఇష్టపడేలా డిజైన్ చేశానని చెప్పారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? అన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వివరాలు త్వరలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది ఇలా ఉంటే యూవీ క్రియేషన్స్ నిర్మించే సినిమాలో అనుష్క హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news