నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ ఇద్దరు ఎంత ప్రేమతో.. అనురాగంతో ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ చాలా సఖ్యతతో ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ వరుసగా తన బ్యానర్ పై సినిమాలు చేసి.. అవి ప్లాపులు అవ్వడంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా జై లవకుశ సినిమా చేసి కళ్యాణ్ రామ్‌ను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ …కళ్యాణ్‌రామ్ చేయాల్సిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారు. అనిల్ రావి పూడిని దర్శకుడిగా పరిచయం అయిన సినిమా పటాస్ కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ కథ కళ్యాణ్ రామ్‌కు వినిపించగా చాలా బాగా నచ్చింది. అయితే తన బ్యానర్ లో స్టార్ హీరో తో ఈ సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అనిల్ కూడా ఎన్టీఆర్ కు కథ చెప్పగా ఎన్టీఆర్ కు బాగా నచ్చింది… కళ్యాణ్ రామ్‌కు మాత్రం ఎన్టీఆర్ తో చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్న ఆశ ఉంది. అయితే ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్ వరుస ప్లాపుల్లో ఉన్నందున కళ్యాణ్ చేస్తేనే బాగుంటుందని అనిల్ రావిపూడి కి చెప్పారు. అయితే అదే టైంలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్గా టెంపర్ సినిమా చేస్తున్నారు.
వెంటనే మరో పోలీస్ ఆఫీసర్ సినిమా చేస్తే బాగోదని చెప్పడంతో పాటు కళ్యాణ్‌రామ్ ఈ సినిమా చేస్తే సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని అనిల్‌కు చెప్పాడట. చివరకు అనిల్ రావిపూడి కూడా కళ్యాణ్ రామ్ తో ఈ సినిమా తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.