నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికే ఫస్ట్ ఆఫ్, సెకండ్ ఆఫ్ సక్సెస్ఫుల్గా షూటింగ్ పూర్తి చేయగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. మరోవైపు తమన్ నేపథ్య సంగీతం అందించేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి థియేటర్లలోకి దిగుతున్నాడు.
అసలే అఖండ – వీరసింహారెడ్డి లాంటి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. తాజాగా భగవంత్ కేసరి నుంచి మరో వీడియో రిలీజ్ అయింది. షూటింగ్ కంప్లీట్ అంటూ ఈ వీడియో రిలీజ్ చేశారు. వీడియో చివర్లో బ్రో ఐ డోంట్ కేర్ అనే డైలాగ్ చెప్తాడు. బాలయ్య అసలు ఈ సినిమాకు ముందుగా ఈ డైలాగ్ టైటిల్‌గా పెడతారని ప్రచారం నడిచింది.
అయితే బ్రో మిస్ అయిన ఐ డోంట్ కేర్ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్‌గా మారింది. బ్రో టైటిల్ పవన్ – సాయితేజ్ మల్టీస్టారర్‌కు పెట్టుకున్నారు. ఇక బ్రో ఐ డోన్ట్ కేర్ అన్న డైలాగ్ కంటే బాలయ్య పేరే టైటిల్‌గా పెడితే బాగా యాప్ట్ అవుతుందనే భగవంత్ కేసరి టైటిల్ పెట్టారు. ఇక ఈ వీడియో రిలీజ్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. షూటింగ్ కంప్లీట్ అయింది అన్న విషయం చెప్పడంతో పాటు సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.
దసరాకు నందమూరి, బాలయ్య తెలుగు సినిమా అభిమానులు థియేటర్లలో ఈ సినిమా చూసేందుకు రెడీగా ఉండాలని చెప్పేశారు. ఎనిమిది నెలలపాటు ఎంతో కష్టపడి చక చక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. 24 లోకేషన్లతో పాటు 12 భారీ సెట్లు వేసి మరి సినిమాను షూట్ చేశారు. ఇక వర్కింగ్ షాట్స్ కాకుండా వర్కింగ్ విజువల్స్ తో వీడియో విడుదల చేయటం చాలా బాగుంది.