సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. స్టార్ హీరోలుగా మారి రాజ్యాన్ని ఏలేస్తున్న యంగ్ స్టార్స్ కూడా ఉన్నారు . అయితే చాలామందికి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం రాదు .. చాలా రేర్ గానే అలాంటి మనుషులు కనిపిస్తూ ఉంటారు. ఒకప్పటి సీనియర్ హీరోలు అయితే మాత్రం చాలా ఓపిగ్గా తెలివిగా కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు . కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కి మాత్రం పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి దూకుడుగా ఆన్సర్ ఇవ్వడమే తెలుసు .
కానీ ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడటం తెలియదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన మధ్య ఉన్న ఈ జనరేషన్ హీరోలలో అలా డేర్ గా ఉన్నది ఉన్నట్లు స్టేజి పైన మాట్లాడే హీరోలు ఇద్దరే ఉన్నారు .వాళ్లే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ – రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ. ఎస్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉండొచ్చు.. పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలోకి వెళ్లి క్రేజ్ దక్కించుకున్న హీరోలు ఉండొచ్చు.. కానీ ఏ హీరో కూడా ఎవరైనా రిపోర్టర్ కానీ, ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ.. గొంతు విప్పి అడిగే ధైర్యం లేదు .
అయితే అలా సినిమా ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉన్న ఇద్దరు హీరోలు విజయ్ దేవరకొండ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు అల్లు అర్జున్ కూడా ఈ మధ్యకాలంలో బేబీ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలు ముందుకు రండి .. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉండడం చాలా ఇంపార్టెంట్ ..అంటూ చెప్పుకు వచ్చారు. అంతేకాదు విజయ్ దేవరకొండ సైతం తన ఈవెంట్లో తన సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నకు చాలా బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత ట్రోలింగ్ జరుగుతుందా..? నెగటివ్గా కామెంట్ చేస్తారా..? అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు . ఇద్దరు హీరోలు ఆ విషయంలో ఒక్కటే అని చెప్పాలి..!!