నందమూరి హీరో కళ్యాణ్ రామ్ గత ఏడాది బింబిసర్ లాంటి సోషియో ఫాంటసీ సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ ఏడాది అమీగోస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఒక శీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా జరుపుకుంటోంది. బింబిసార సినిమాలో హీరోయిన్గా నటించిన సంయుక్త మీనన్ ఈ సినిమాలోను హీరోయిన్గా చేస్తోంది.
నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు జరిగిన కథతో డెవిల్ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం భారీ సెట్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 1940 కాలం నాటి స్టోరీ కావడంతో అందుకు తగినట్టుగానే షూటింగ్ సెట్ రూపొందించారు. ఆ కాలంనాటి పరిస్థితులు కళ్ల ముందు కనిపించేలా ఆర్ట్ డైరెక్టర్లు సెట్లు డిజైన్ చేశారు.
బ్రిటిష్ కాలంలో సెట్స్ వేయటం తనకు ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించిందని ఆర్ట్ డైరెక్టర్ గాంధీ చెప్తున్నారు. స్వాతంత్య్రం సమయంలో మన దేశంలో పరిస్థితులు ఎలా ? ఉన్నాయో చూపించేందుకు తమిళనాడు – కర్ణాటక – కేరళ – రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి సామాగ్రిని తెప్పించి ప్రత్యేకంగా సెట్స్ వేసినట్టు తెలుస్తోంది. ఈ సెట్స్ చూస్తుంటే సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన స్పెషల్ సెట్స్ ఇవి:
1- 1940 మద్రాస్ ప్రాంతంలో ఆంధ్ర క్లబ్
2- బ్రిటిష్ కాలానికి తగినట్లుగా పది వింటేజ్ సైకిల్స్ – ఒక వింటేజ్ కారు
3- బ్రిటిష్ కవర్ డిజైన్ తో ఉన్న 500 పుస్తకాలు
4- 1940 కాలానికి చెందిన కార్గో షిప్
5- 36 అడుగుల ఎత్తున లైట్ హౌస్ సెట్ ( వైజాగ్ సమీపంలో )
6- ఈ సెట్స్ వేయడానికి మొత్తం తొమ్మిది ట్రక్కుల కలప తెప్పించారు. చాలా వింటేజ్ వాల్ పేపర్ ఉపయోగించినట్లు సమాచారం.