టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యంగ్ క్రేజీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. 2013 సంక్రాంతి కానుకగా మహేష్ బాబు – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత శ్రీకాంత్‌ను గుడ్డిగా నమ్మేసిన మహేష్ కథ పూర్తిగా వినకుండానే బ్రహ్మోత్సవం సినిమా చేసేసాడు.
2016 లో వచ్చిన ఈ ఫ్యామిలీ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు పరువు మొత్తం తీసేసింది. కాజల్ – సమంత – ప్రణీత ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా బ్రహ్మోత్సవం ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ పెద్దకాపు 1 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.
ఈ ప్రమోషన్ లో మాట్లాడుతూ బ్రహ్మోత్సవం ప్లాప్ అయిన టైంలో మహేష్ బాబు గారిని కలిసినప్పుడు మనం బాగున్నాం కదా దానిదేముంది.. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయని అన్నారని.. తమ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం కొనసాగుతుందని తెలిపారు. అయితే శ్రీకాంత్ ఇక్కడ చాలా కవర్ చేసుకున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి బ్రహ్మోత్సవం కథ పూర్తిగా రెడీ కాకుండానే శ్రీకాంత్ మీద నమ్మకంతో ఓకే చెప్పేశాడు. సినిమా సగం తీశాక అసలు ఏ సీన్ ఎటు తీస్తున్నాడో మహేష్‌కే అర్థం కావట్లేదట. అప్పుడు సీరియస్‌గా అడగగా కథ రెడీ కాలేదన్న విషయాన్ని చెప్పడంతో మహేష్ శ్రీకాంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడన్న టాక్ వచ్చింది.
అందుకే ఆ సినిమా కూడా సరిగా ఆడలేదు… అసలు కథ రెడీకాకుండా సినిమా తీశారన్న విషయం చూస్తేనే అర్థమవుతోంది. అయితే ఇప్పుడు పెదకాపు 1 ప్రమోషన్లలో శ్రీకాంత్ తెలివిగా మహేష్ తనను ఏం అనలేదు అంటూ కవరింగ్ ఇచ్చుకుంటోన్న పరిస్థితి.