సినిమా ఇండస్ట్రీలో చాలాసార్లు ఒక హీరో కోసం కథను రాసుకుని మరొక హీరోతో సినిమాను తెరకెక్కిస్తూ ఉంటారు డైరెక్టర్ లు. రీజన్స్ ఏవైనా కావచ్చు పరిస్థితులు ఎలాంటివైనా కావచ్చు .. అలా మనం చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి హిట్ కొడితే ఆ బాధ చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటి బాధను మన ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ రుచి చూశారు . కానీ మనం నో చెప్పిన సినిమా వేరే హీరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని ఆ సినిమా ద్వారా మరికొన్ని బ్లాక్ బస్టర్ అందుకుంటే ఆ బాధ వర్ణాతితం ..అలాంటి బాధను ఎన్నో సార్లు అనుభవించాడు మాస్ హీరో రవితేజ .
ఈయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈయన దగ్గరకు వచ్చిన సినిమాలన్నీ పరాయి హీరోలు చేసి సూపర్ డూపర్ హిట్లు అందుకోవడం సంచలనంగా మారడం జరిగిపోయింది . కాగా ఆలిస్ట్ లోకి వస్తుంది గబ్బర్ సింగ్ మూవీ. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమా ఎంతటి పెద్ద విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అయితే హరిష్ శంకర్ ఈ సినిమా కథను ముందుగా రవితేజకే వివరించారట . కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా కథ పవన్ కళ్యాణ్ కి బాగుంటుంది అని పవన్ వద్దకు వచ్చి చెప్పారట . ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేయడం ఆయన కెరియర్ మారిపోవడం చకచకా జరిగిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే మనం ఎంతో ఇంట్రెస్టింగ్ గా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాం.. అంత బాగా తెరకెక్కించాడు హరీష్ శంకర్..!!