సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు .. ఎన్నిసార్లు చూసినా తనివి తీరవు.. అలాంటి సినిమానే జయం . హీరోగా నితిన్ తెరంగేట్రం చేసిన సినిమా ఇదే ..హీరోయిన్గా సదా తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమైన మొదటి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డు తిరగరాసింది .అంతేకాదు లవర్స్ కు కొత్త ఫీలింగ్ కలగజేసింది . ప్రేమంటే ఇదే అనే రేంజ్ లో ఈ సినిమా అందరిలో తెలియని ఫ్రెష్ ఫీలింగ్ నింపేసింది.
కాగా ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ లీనమైపోయి నటించడమే కాకుండా అభిమానులను చాలా బాగా తన నటనతో మెప్పించాడు. అయితే ఈ సినిమాలో ఓ సీన్ సదా చేయను అంటే చేయను అని మొండి చేసిందట . కానీ డైరెక్టర్ బలవంతంగా ఆమె చేత ఆ సీన్ చేయించాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే స్టోరీలో సదా నితిన్ కోసం గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది . ఈ క్రమంలోనే పసిగట్టేసిన గోపీచంద్ ఆమెను ఫాలో అవుతూ గుడి వెనకాల ఆమె నితిన్ కలుసుకోవడం చూసి .. ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు.
అంతేకాదు ఈ క్రమంలోని గోపీచంద్ ఆమెను అతి జుప్సాకరంగా నాలికతో నాకుతాడు . అయితే నిజానికి సదా ఈ సీన్ చేయను అంటూ చాలా మొండి చేసిందట . ఆఖరికి ఏడ్చేసిందట . కానీ తేజ మాత్రం కనికరించకుండా.. ఈ సీన్ సినిమాకి హైలైట్ అవ్వబోతుంది అంటూ ఆమె చేత బలవంతంగా సీన్ చేయించారట. ఆ సీన్ చేసిన సదా షాట్ అయ్యాక..10సార్లు ముఖం కడుకున్నిందట..!!