Moviesసాయి పల్లవి పెళ్లి ఫోటో పై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.....

సాయి పల్లవి పెళ్లి ఫోటో పై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదుగా..!!

గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి ఫోటో ఇదే అంటూ ఫోటో తెగచక్కర్లు కొడుతుంది . అయితే ఎట్టకేలకు ఆ ఫోటోపై క్లారిటీ వచ్చేసింది . అది నిజమైన పెళ్లి ఫోటో కాదు అని ఓ సినిమా కార్యక్రమంలో భాగంగా పూజ కార్యక్రమాలలో దిగిన ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ . అయితే నిజానికి సాయి పల్లవి పెళ్లి న్యూస్ పై అభిమానులు ఇంత ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉండడానికి కారణం ఆమెకున్న క్రేజీ స్టేటస్ అనే చెప్పాలి.

కాగా సాయి పల్లవి డైరెక్టర్ పెరియస్వామితో దిగిన ఫోటోని క్రాప్ చేసి మరి వాళ్ళ పెళ్లి ఫోటో అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసారు ఆకతాయిలు. ఆ ఫోటోపై తెలుగు డైరెక్టర్ వేణుఉడుగుల క్లారిటీ ఇచ్చారు . ఆ ఫోటో అసలు ఏ మూమెంట్లో దిగింది ..ఎంతమంది ఉన్నారు ..ఆ ఫోటోలో అంటూ ఓపెన్ గా ఒరిజినల్ ఫోటోలు తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేశారు . దీంతో ఇది మొత్తం ఫేక్ అంటూ క్లారిటీ వచ్చేసింది.

విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల సాయి పల్లవి పెళ్లిపై పరోక్షంగా స్పందించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాని తాలుకా ఫుల్ ఫోటోలో పోస్ట్ చేశారు . సాయిపల్లవి – శివ కార్తికేయన్ తో నటించే సినిమా పూజ కార్యక్రమాలలో ఓ ఫోటో దిగారు . ఆ ఫోటోని ఈ విధంగా ట్రోల్ చేశారు కుర్రాళ్లు. ఫైనల్లీ అది మొత్తం ఫేక్ అంటూ తెలియడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news