Movies"ఖుషి" సినిమాకి మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. సెట్ అయ్యుంటే...

“ఖుషి” సినిమాకి మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. సెట్ అయ్యుంటే మరో అర్జున్ రెడ్డినే..జస్ట్ మిస్..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఖుషి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయింది . కాగ బ్యాక్ టు బ్యాక్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది . ఓ వర్గం ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చుతుంటే మరి కొంతమంది జనాలకు మాత్రం ఈ సినిమా టు బోల్డ్ గా అనిపిస్తుంది.

మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లు రియాలిటీని చూపించాడు శివనిర్వాణ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అయితే ఇది అందరికీ తెలిసిన స్టోరీ అని.. పెద్దగా కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు అన్న కామెంట్స్ సైతం నెట్టింట వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఖుషి సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకునింది రష్మిక మందన్నాను అంటూ తెలుస్తుంది .

హీరోగా రౌడీ విజయ్ దేవరకొండ ఫిక్స్ చేసుకున్న శివనిర్వాణ హీరోయిన్గా రష్మిక అయితే బాగుంటుందని అనుకున్నారట . కానీ తెరపై ఇప్పటికే రష్మిక మందన్నా.. విజయ్ దేవరకొండ ను చాలా సార్లు చూశారని అదే జోడిని రిపీట్ చేస్తే కిక్ ఉండదని కాంట్రవర్షియల్ బ్యూటీని ఈ రోల్ లో పెడితే కచ్చితంగా సినిమాకి హైప్ వస్తుందని శివ నిర్వాణ భావించారట. అప్పటికే డివర్స్ తీసుకొని సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ ” గా ట్రెండ్ అవుతున్న సమంత ఈ పాత్రకు న్యాయం చేయగలదు అంటూ .ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్లి ఈ స్టోరీని వివరించారట . మొదట ఆ ఊ అంటూ సాగదీసిన సమంత ఫైనల్లీ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడడంతో సినిమాను ఓకే చేసిందట . అలా ఈ సినిమా రష్మిక ఖాతాలో నుంచి సమంత ఖాతాలో వచ్చి చేరింది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news