సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు.. బ్రేకప్ లు.. విడాకులు చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఉండే చాలామంది ప్రేమించుకున్న కొద్దిరోజులకే విడిపోవడం.. పెళ్లి చేసుకున్న రెండు మూడు సంవత్సరాలకు విడాకులు తీసుకోవడం చాలా చూశాం. ఇది ఎప్పటినుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. చాలా చిన్నచిన్న కారణాల వల్ల పెళ్లయిన జంటలు కూడా విడిపోవడం చూశాం.
కోలీవుడ్లో నయనతార – శింబు ప్రేమాయణం అప్పట్లో ఒక సంచలనం. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్న టైంలో ఇద్దరి మధ్య సడన్గా బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత మరో హీరోయిన్ యాపిల్ బ్యూటీ హన్సికతో శింబు లవ్ ట్రాక్ నడిపాడు. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు అనే వరకు వచ్చింది. హన్సిక విదేశాల్లో సినిమా షూటింగ్ లు చేస్తున్నా శింబు అక్కడ వాలిపోయేవాడు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు అనుకుంటోన్న టైంలో ఉన్నటువంటి వీరి ప్రేమ బంధం కూడా తెగిపోయింది.
అయితే వీరిద్దరూ విడిపోవడానికి ఒక హీరో కారణం అన్నది అప్పట్లో బయటికి వచ్చిన టాక్. శింబూ – హన్సిక ప్రేమించుకున్న తర్వాత కూడా హన్సిక చాలా సినిమాలలో నటించింది. ఈ క్రమంలోనే ఓకే ఓకే సినిమాలో ప్రస్తుతం తమిళనాడు మంత్రిగా ఉన్న ఉదయినిధి స్టాలిన్ తో కలిసి నటించింది. ఆ సినిమా టైమ్ లోనే ఉదయనిధి – శింబు మధ్య సరికొత్త బంధం ఏర్పడిందన్న వార్త బాగా వైరల్ అయింది.
రాజకీయంగా కూడా ఇది చాలా హైలెట్ కావడంతో అందరూ నిజమే అని భావించారు. ఈ విషయం సింబుకు తెలియడంతో తట్టుకోలేకపోయిన సింబు నేరుగా హన్సికని ఈ విషయం గురించి అడిగేశాడట. హన్సిక అలాంటిదేమీ లేదని చెప్పిన శింబు ఆమెపై బాగా కోప్పడడంతో హన్సిక మనసు విరిగిపోయింది. ఆ వెంటనే ఆమె అతడితో బ్రేకప్ చెప్పేసింది. ఇక హన్సిక గత ఏడాది ఓ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.