Newsఅర్ధరాత్రి సామ్ కి కాల్ చేసి అలా అడిగిన స్టార్ హీరో.....

అర్ధరాత్రి సామ్ కి కాల్ చేసి అలా అడిగిన స్టార్ హీరో.. సమంత కూడా ఒప్పేసుకుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కు కాల్ చేసి మరి ఆ స్టార్ హీరో ఆఫర్ ఇచ్చారా ..?అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . రీసెంట్ గానే సమంత ఖుషి అనే సినిమాలో నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సమంత హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే సామ్ కు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి . ఇప్పటికే రెండు మూడు ఆఫర్ లు రాగ సమంత హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది . రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో నుంచి అమ్మడుకు డైరెక్ట్ ఫోన్ కాల్ ద్వారా ఆఫర్ వచ్చిందట . ఆ హీరో మరి ఎవరో కాదు సల్మాన్ ఖాన్ . సల్మాన్ ఖాన్ ప్రజెంట్ ఫోకస్ మొత్తం టైగర్ 3 మీదనే ఉంది. ఈ సినిమా తరువాత సల్మాన్ .. విష్ణువర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు.

అయితే ఈ సినిమా లో హీరోయిన్గా సమంతను చూస్ చేసుకున్నారట మేకర్స్ . వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు . అయితే సమంత మాత్రం ఇంకా దీనిపై ఆలోచిస్తున్నాను అని చెప్పుకొచ్చిందట . ఈ క్రమంలోనే డైరెక్ట్ గా సల్లూ భాయ్ రంగంలోకి దిగి సమంతకి ఫోన్ చేసి మరి సినిమాలో నటించమని అడిగారట . అయితే అంత సల్మాన్ ఖాన్ అడిగాక ఏ అమ్మాయి అయినా నో చెప్తుందా..? సమంత కూడా నటించే ఆలోచనలోనే ఉంది అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో సమంత – సల్మాన్ ఖాన్ పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news