సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా గుర్తింపు సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇప్పటి హీరోయిన్స్ ఆమె అందం ముందు ఆమె నటన ముందు దేనికి పనికిరారు అని చెప్పడంలో సందేహమే లేదు. కాగా అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి ఇప్పటికి మన మధ్య ఉన్నట్లే జనాలు భావిస్తూ ఉంటారు . ఆమె సినిమాల రూపంలో ఇప్పటికీ మన మధ్య తిరుగుతూనే ఉంటుంది అంటూ ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . కాగా శ్రీదేవి చాలా మంచిదని ఆమె అందరికీ హెల్ప్ చేస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎప్పుడు ఆమె గురించి పాజిటివ్ గానే స్పందిస్తూ ఉంటారు.
అయితే ఆమెలో మరో తెలియని యాంగిల్ కూడా ఉందని ఆమె స్టార్ హీరోలతో తప్పిస్తే మరో హీరోలతో నటించదని .. కొన్నిసార్లు స్టేటస్ బట్టే శ్రీదేవి నటిస్తూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు స్టేటస్ బట్టే ఆమె ప్రియారిటీ కూడా ఉంటుందట . ఓ స్టార్ కమెడియన్ ని చూసి అతనితో నేను సినిమా చేయనంటే చేయను అని వెళ్ళిపోయిందట . ఆ కమెడియన్ ఎవరో కాదు చిదంబరం .
ఒకప్పుడు చాలామంది కమెడియన్స్ తమ మొహంలోని హావ భావాలతో నవ్వులు తెప్పించేవారు ..అలాంటి వారిలో చిదంబరం కూడా ఒకరు. ఈయన మొదట కళ్ళు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కళ్ళు చిదంబరం గా మారిపోయారు . రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో గోవిందా గోవింద సినిమా షూట్ లో చిదంబరం కామెడియన్ గా కనిపిస్తారు. కానీ షూటింగ్లో అతని పక్కన శ్రీదేవి ఓ సీన్ చేయాలంటే భయపడి పోయి చిదరించుకొని నో చెప్పిందట.
అయితే రాంగోపాల్ వర్మ ఇదే విషయం తెలుసుకుని “నువ్వు ఈ సినిమాలో చేయకపోయినా పర్లేదు… ఆయన్ని అలా అవమానించడం మంచిది కాదు ..పద్ధతి కాదు అంటూ కోపడ్డారట”. ఈయన ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు అంటూ ఆ కమెడియన్ ని ఓ రేంజ్ లో పొగిడేసి శ్రీదేవికి ఫుల్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారట . ఆ తర్వాత ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకున్న శ్రీదేవి అతనితో నటించడానికి ఇష్టపడింది . ఇక అప్పటినుంచి చిదంబరం ఎక్కడ కనిపించిన శ్రీదేవి స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చేదట .