ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముందు గుమ్మలు ఎలా ఓపెన్ గా ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చేస్తున్నారో.. మనం బాగా చూస్తూనే వస్తున్నాం. కాగా రీసెంట్గా నాగర్జున కొడుకు నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళ్ల అలాగే ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు వచ్చేసింది. తన అంద చందాలతో సోషల్ మీడియాని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్న శోభిత ధూళిపాళ్ల.. నాగచైతన్యతో లవ్ లో ఉంది అని ..పెళ్లి చేసుకోబోతుంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . దానికి తగ్గట్టే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అవుతున్నాయి .
కాగా రీసెంట్గా శోభిత ధూళిపాల నటించిన “మేడిన్ హెవెన్ సీజన్ 2 ” రిలీజ్ అయి అభిమానుల్ని అలరించింది. ఈ క్రమంలోనే జోహార్ తనకు ప్రధాన పాత్ర ఇవ్వడం నమ్మలేకపోయానని చెప్పుకొచ్చిన ఆమె ..”నా టాలెంట్ ఆధారంగానే ఇలాంటి పాత్ర వచ్చింది అని నమ్ముతున్న.. నా పాత్ర రియల్ లైఫ్ కు చాలా చాలా దగ్గరగా ఉంటుంది ..ధైర్యం – నైతిక విలువలు హడావిడి చేసే మనస్తత్వం నాది ..అన్ని సేమ్ అందుకే జనాలు నన్ను ఆదరిస్తున్నారు.. వాళ్ల ప్రేమ అభిమానమే నన్ను ఈ స్థాయిలో నిలిచోబెట్టింది “అంటూ చెప్పుకొచ్చింది .
అంతేకాదు తనకు చేతినిండా సినిమా లేకపోతే అస్సలు నిద్ర పట్టదు అంటూ కూడా చెప్పుకొచ్చింది. చేతినిండా పని ఉండాలని కోరుకున్నప్పటికీ తరచు తెరపై కనిపించాలని అత్యాశతో ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను అంటూ కూడా ఓపెన్ గానే కామెంట్స్ చేసింది . శోభిత ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!