అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శీను ఏ హీరోతో సినిమా చేస్తాడా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూశారు. ఈ సమయంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తున్నాను అని బోయపాటి ప్రకటించి అందరిని షాక్ కు గురి చేశాడు. అనుకున్న టైం కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసి టైటిల్ కూడా పెట్టేశాడు. మరో నాలుగైదు రోజుల్లో ఈ సినిమా ధియేటర్లలోకి కూడా వచ్చేస్తోంది. ఈ సినిమా స్కంద.
రామ్ – శ్రీ లీల జంటగా నటించిన స్కంద సినిమా బోయపాటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలకు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి డివైడ్ రెస్పాన్స్ వస్తోంది. మామూలుగా బోయపాటి సినిమాలకు టీజర్లు, ట్రైలర్లు వచ్చాక అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. అయితే ఎందుకో స్కంద విషయంలో ఆ రేంజ్ లో రెస్పాన్స్ అయితే రావడం లేదు. హీరో రామ్ డైలాగ్ మోడ్యులేషన్ పెద్దగా బాగోలేదని.. రామ్‌కు ఇలాంటి సినిమాలు సెట్ కావు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ కావడంతో ప్రసాద్ ల్యాబ్స్‌లో కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసినట్టు తెలుస్తోంది. వాళ్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రకారం ఈ సినిమా కథ చాలా రొటీన్ గానే ఉందట. అయితే బోయపాటి టేకింగ్ మాత్రం ఊర మాస్ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఇలాంటి సినిమాలకు థియేట్రికల్ రన్ పెద్దగా రావడం లేదు. సినిమాలో శ్రీలీల కూడా ఉంది.. అలాగే ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్‌లో నటించింది.
కల్టు మామ అంటూ సాగే ఈ పాటని రీసెంట్ గానే రిలీజ్ చేశారు. ఈ పాటకు కూడా అంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ యంగ్ హీరో ప్రిన్స్ నటించాడు. గతంలో రామ్ – ప్రిన్స్ కలిసి నేను శైలజ సినిమాలో నటించారు. ఏది ఏమైనా స్కంద సినిమాకు మరి అంత గొప్ప టాక్ రాదని చెబుతున్నారు. అదే టైంలో ఎక్కడో ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎక్కితే బీ, సీ సెంటర్లకు కనెక్ట్ అయితే ఓకే… లేకపోతే రామ్‌ను ఆ దేవుడే కాపాడాలి అన్న కామెంట్లు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి బోయపాటి – రామ్‌ను ముంచుతాడా.. గట్టెక్కిస్తాడా అన్నది ఈనెల 28న తేలిపోనుంది.