News' స్కంద ' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల లెక్క‌లు... రామ్ మాస్‌...

‘ స్కంద ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల లెక్క‌లు… రామ్ మాస్‌ రికార్డ్‌

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని – స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా స్కంద. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకుంది. కొన్ని నెగటివ్ రివ్యూలు ఉన్నా కూడా మాస్ ప్రేక్షకులకు బీ, సీ సెంటర్ల సినీ ప్రేక్షకులకు స్కంద బాగా నచ్చుతుందన్న టాక్‌ అయితే వచ్చేసింది.

అయితే తొలిరోజు టాక్ తో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. అటు బోయపాటి నుంచి అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత వచ్చిన సినిమా కావటం.. యంగ్ ఎన‌ర్జిటిక్‌ రామ్ హీరో కావటం.. క్రేజీ హీరోయిన్ శ్రీలీలా – సాయి మంజరేకర్, సీనియర్ హీరో శ్రీకాంత్, సీనియ‌ర్ హీరోయిన్లు గౌతమి, ఇంద్రజతో పాటు ప్రభాకర్ లాంటి నటులు ఉండడం ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది.

అలాగే పాటలు అంతా క్యాచీగా లేకపోయినా తమన్‌ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు కలిసి వచ్చింది. నిన్న సెలవు కావడంతో మ్యాట్నీ నుంచి బుకింగ్స్ ఊపందుకున్నాయి. తొలిరోజు రెండు రాష్ట్రాలలో కలిపి రు. 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్టు ట్రేడ్ పండితుల ప్రాథమిక రిపోర్టులు చెబుతున్నాయి.

ఇది రామ్ – బోయ‌పాటి మాస్ మ్యానియా అని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా కూడా ఇదే రేంజ్‌లో దూసుకుపోతే తొలి రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏరియాల వారీగా స్కంద తొలిరోజు వసూళ్ల అప్డేట్స్ కొద్దిసేపట్లో నిర్మాతలు వెల్లడించనున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news