బోయపాటి శీను సినిమాలు అంటేనే పవర్ఫుల్ డైలాగ్లు తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది. తాజాగా ఎనర్జిటిక్ రామ్ – శ్రీలీల కాంబినేషన్లో బోయపాటి తెరకెక్కించిన సినిమా స్కంద. ఈ సినిమాలో బోయపాటి ఏపీ, తెలంగాణ పొలిటికల్ అంశాలతో పాటు తాజా పాలిటిక్స్, కొందరు కీలక వ్యక్తులపై అదిరిపోయే సెటైర్లు పేల్చారు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ సీఎం, తెలంగాణ సీఎం.. వారి మధ్య వార్ అంశాలు కీలక అంశాలుగా ఉన్నాయి.
ముందుగా సినిమా ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంట్లో హై ప్రొఫైల్ సీన్తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత తెలంగాణ సీఎం గ్యాంగ్ ఒక వైలెంట్ సన్నివేశంతో పరిచయం అవుతారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల మధ్య క్లాస్ జరగటం.. తెలంగాణ సీఎం కూతురిగా శ్రీలీల ఎంటర్ ఇవ్వటం తెలంగాణ సీఎం కి సోదరిగా ప్రిన్స్ పరిచయం కావటం లాంటి అంశాలతో సినిమా ఫస్ట్ అఫ్ నడుస్తుంది. ఈ సన్నివేశాలను బట్టి చూస్తే బోయపాటి స్కంద సినిమాను కంప్లీట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
అలాగే సినిమాలో గత ఎన్నికలలో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ పై ఒక సెటైరికల్స్ ని కూడా వేశారు. ఇక రామ్ – శ్రీలీల మధ్య క్యూట్ కాలేజీ సీన్లు.. ఫన్నీ సీన్లు కూడా ఫస్ట్ ఆఫ్ లోనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వడ్డే నవీన్ హీరోగా వచ్చిన బ్లాక్బస్టర్ సినిమా పెళ్లి సినిమాలో విలన్ గా చేసిన పృథ్వి ఈ సినిమాలో విలన్ గా నటించాడు.
ఇక సీనియర్ హీరో శ్రీకాంత్ కూతురుగా సాయి మంజరేకర్ కనిపించింది. ఏది ఏమైనా స్కంద సినిమాలో పొలిటికల్ సీన్లు అయితే మామూలుగా లేవు. మరి వీటిపై ఏపీ, తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఏదైనా కాంట్రవర్సీ ఉంటుందా లేదా అన్నది కొద్దిసేపట్లో తేలిపోనుంది.