Moviesస్టేజీ పైనే మహేశ్ బాబు ని అడ్దంగా ఇరిక్కించేసిన స్టార్ డైరెక్టర్.....

స్టేజీ పైనే మహేశ్ బాబు ని అడ్దంగా ఇరిక్కించేసిన స్టార్ డైరెక్టర్.. ఆ మాత్రం మ్యానర్స్ లేదా బాస్ నీకు..?

కొన్నిసార్లు డైరెక్టర్ లు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ అడ్డంగా హీరోస్ ని మాత్రం బుక్ చేస్తూ ఉంటారు . కాగా రీసెంట్గా ఎస్ జె సూర్య అలాంటి ఓ కామెంట్స్ చేసి మహేష్ బాబును అడ్డంగా బుక్ చేసేసారు. మనకు తెలిసిందే సూర్య కోలీవుడ్ లో పాటు టాలీవుడ్ లోను సినిమాలను డైరెక్ట్ చేసే స్టార్ గా మారారు . నటుడుగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కాగా కోలీవుడ్ లో ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వగా .. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ కి ఖుషి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు . అయితే మహేష్ బాబు కి మాత్రం ఆయన మర్చిపోలేని డిజాస్టర్ ని ఇచ్చారు.

మహేశ్ బాబు “నాని” సినిమాను డైరెక్ట్ చేసింది ఎస్ జె సూర్యనే. ఈ సినిమా ఎంత పరమ చెత్తగా రికార్డులను ఎంత చెత్తగా టాక్ ను సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇప్పటికి మహేష్ బాబు కెరియర్ లో డిజాస్టర్ సినిమా ఏది అంటే నాని అనే చెప్పుకొస్తారు . రీసెంట్ గా ఎస్ జె సూర్య చేసిన సినిమా “మార్క్ ఆంటోనీ”. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మహేష్ బాబు గురించి ప్రస్తావిస్తూ..” నేను మహేష్ బాబుకు బాకీ పడిపోయాను ..అందరి హీరోలకి హిట్లు ఇచ్చిన నేను మహేష్ కు హిట్ ఇవ్వలేకపోయాను.. త్వరలోనే ఓ సినిమా చేసి ఆ బాకీ తీర్చుకుంటాను ” అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు . ఇప్పుడు నీ స్టేటస్ ఏంటి..? ఆయన స్టేటస్ ఏంటి ..? ఆయన పాన్ ఇండియా రేంజ్ .. గ్లోబల్ స్థాయిలో మారిపోయింది .. నీతో సినిమా అవకాశం ఎవరు ఇస్తారు ..? అంత పెద్ద స్టేజ్ మీద అలా అనౌన్స్ చేస్తే కచ్చితంగా స్టార్ హీరోలు కాల్ షీట్స్ ఇస్తారని అనుకుంటున్నావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు నో చెప్తారా..? ఎస్ చెప్తారా అన్నది ప్రశ్నర్ధకంగా మారింది..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news