కోలీవుడ్ యంగ్ క్రేజీ హీరో మన్మధ శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శింబుకు తెలుగుతోపాటు తమిళ సినిమా రంగాలతో ఎంతో అనుబంధం ఉంది. శింభు తండ్రి టి రాజేందర్ దర్శకత్వం వహించిన ప్రేమ సాగరం సినిమా తెలుగులోకి డబ్బింగ్ అయ్యి ఇక్కడ ఏకంగా 400 రోజులపాటు ఆడింది అంటే టీ రాజేందర్ దర్శకత్వ ప్రతిభ తెలుగు ప్రేక్షకులను ఎలా ఉర్రూతలూగించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక గత కొంతకాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకుల్లో ఉన్న శింబు రీసెంట్ గా నటించిన మానాడు – విందు తనిందదు కాడు రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం కమల్‌హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సినిమాలో శింబు నటిస్తున్నాడు పెరియస్వామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శింబు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే 40 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే శింబు పరుగు హీరోయిన్లతో ప్రేమాయణాలు నడపటం పెళ్లి వరకు వచ్చి అవి బ్రేకప్ అవటం జరుగుతూ వస్తోంది.
శింబు కెరీర్ ప్రారంభంలోనే క్రేజీ హీరోయిన్ నయనతారతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు పెళ్లి వరకు వెళ్లారు అనుకుంటున్న టైంలో బ్రేకప్ అయ్యింది. తర్వాత ఆపిల్ బ్యూటీ హన్సికతోను ప్రామాయణం నడిపాడు. సేమ్ వీరిద్దరు కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇక తాజాగా శింబు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్లో హల్చల్ చేస్తోంది. శింబుకు కళ్యాణ ఘడియలు వచ్చేసాయని తెలుస్తోంది.
ఇది ప్రస్తుతం తమిళ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. శింబుకు కాబోయే మామగారికి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన తమిళనాడులో స్టార్ హీరోల సినిమాలకు కూడా ఫైనాన్ష్ చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనా శింబు ఎట్టకేలకు ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.