Moviesవావ్: మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడబోతున్న షారుఖ్ ఖాన్.....

వావ్: మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి సినిమా చూడబోతున్న షారుఖ్ ఖాన్.. ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ న్యూస్..!!

వచ్చేసింది కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన సమయం రానే వచ్చేసింది. బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా జవాన్ మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెప్టెంబర్ 7న భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తయిపోయాయి . మరీ ముఖ్యంగా ఇప్పటికే రికార్డ్ స్థాయిలో హైదరాబాదులో ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ జరిగాయి .

ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో టికెట్లు అయిపోయాయి . హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోతున్నాయి . ఒక బుక్ మై షో యాప్ లోనే కోటికి పైగా టికెట్లు అమ్ముడు అయిపోయాయి అంటే ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం జవాన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ట్విట్ చేశారు .

“ఇది జవాన్ టైం.. అందరూ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా చూడండి .. షారుఖ్ ఖాన్ పవర్ మొత్తం వెండి తెరపై కనబడుతుంది. ఈ సినిమా అన్ని మార్కెట్లను ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాలని కోరుకుంటున్నా. నేను నా ఫ్యామిలీతో ఈ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నానంటూ ట్విట్ చేశారు”. ఈ ట్వీట్ కు షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చారు . మహేష్ బాబుకు థాంక్యూ చెప్పుతూ..”మీరు నన్ను తెరపై చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి .. నేను మీతో పాటు వచ్చి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తాను ” అంటూ షారుక్ ఖాన్ రిప్లై ఇచ్చాడు . దీంతో ఈ ట్వీట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news