బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా జవాన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది . ఈ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార – దీపికా పదుకొనే హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాల్లో విలన్ గా విజయ్ సేతుపతి తనదైన స్టైల్ లో నటించి మెప్పించారు. అంతేకాదు కీలకపాత్రలో ప్రియమణి మరి కొంతమంది స్టార్స్ నటించిన సినిమాకి తమదైన స్టైల్ లో హిట్ అవ్వడానికి సహాయపడ్డారు.
అట్లీ చెరగని రికార్డును క్రియేట్ చేసుకున్న ..ఈ డైరెక్టర్ జవాన్ సినిమాతో ఆ స్థాయిని మరో రేంజ్ పైకి ఎదిగేలా చేసుకున్నాడు . మొదటి రోజు జవాన్ ఏకంగా 129 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ అంటే ఏంటో ప్రూవ్ చేసింది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ మొదటిరోజు ఏకంగా 129 కోట్లు కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే ఎన్నో వందల కోట్లు ఖర్చు చేసి ఎన్నో భారీ ఎక్విప్మెంట్ యూస్ చేసి మరీ తెరకెక్కించిన ఈ సినిమా ఎంత కష్టపడినా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ప్రభాస్ రికార్డును మాత్రం చెరపలేకపోయింది .
ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అత్యధికంగా కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా రికార్డు అలాగే ఉంది . ప్రభాస్ ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అయినా కూడా మొదటి రోజు ఏకంగా 140 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం హిస్టరీ లోనే ఇదే టాప్ సినిమా. దీంతో షారుఖ్ ఖాన్ ఈ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు . ప్రభాస్ స్థానం అలాగే టాప్ పొజిషన్లో ఉంది. జవాన్ రెండు రోజుల్లో 200 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్ కలెక్ట్ చేసినట్లు సమాచారం అందుతుంది..!!