సమంతకు ఇటీవల అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఆమె నటించిన యశోద అంచనాలు అందుకోలేదు. ఇక శాకుంతలం అతిపెద్ద డిజాస్టర్. ఆ సినిమాలో ఆమె పాత్ర పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇక విజయ్ దేవరకొండకు జోడిగా చేసినా ఖుషి సినిమాలో ఆమె చాలా రొమాంటిక్గా కనిపించింది. అయినా కూడా ఎందుకో సినిమాకు వచ్చిన సూపర్ హిట్ టాక్ తో పోలిస్తే వసూళ్లు ఒక మోస్తరుగానే ఉన్నాయంటున్నారు.
ఈ సినిమా తర్వాత సమంతకు వరుసగా అవకాశాలు వస్తాయి అన్న ప్రచారం గట్టిగా జరిగింది. ఆమె కొంతకాలం సినిమాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన చేసి అమెరికా వెళ్ళింది. ఆమె అమెరికా ఎందుకు వెళ్లిందో క్లారిటీ లేదు. మయోసైటీస్ వ్యాధికి చికిత్స చేయించుకునేందుకే ఆమె అక్కడికి వెళ్లిందని అన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఖుషి ప్రమోషన్ ఈవెంట్ లో కూడా పాల్గొంది.
ఇప్పుడు ఆమె సడన్గా హైదరాబాద్ వచ్చేసిందని తెలుస్తోంది. ఆమె అంత సడన్గా హైదరాబాద్ రావడానికి కారణం ఏంటన్నది ? ఎవరికీ అంతుపట్టడం లేదు. ఖుషి మేకర్స్ మాత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ సక్సెస్ మీట్ కు సమంత వస్తే ఆమె చుట్టూ వస్తున్న కొన్ని సందేహాలు తొలగినట్టు అవుతుంది.
లేకపోతే ఆమెపై మరిన్ని అనుమానాలు మొదలుకావడం ఖాయం. ఏదేమైనా ప్రస్తుతం సమంత ఆరోగ్యం ఎలా ఉంది ? ఏంటి అన్నదానిపై ఆమె అభిమానులలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆందోళన అయితే మొదలవుతూనే ఉంది.