Moviesపిలిచి ఛాన్స్ ఇస్తే..అల్లు అర్జున్ ఆఫర్ నే రిజెక్ట్ చేసిన సాయి...

పిలిచి ఛాన్స్ ఇస్తే..అల్లు అర్జున్ ఆఫర్ నే రిజెక్ట్ చేసిన సాయి పల్లవి..ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వ సాధారణం.. అలాగే ఓ హీరోయిన్ కోసం అనుకున్న కథలో మరో హీరోయిన్ వచ్చి చేరడం చాలా కామన్ గా చేరుతూ ఉంటాయి. ఇప్పటికే అలా బోలెడు మంది హీరోయిన్స్ జీవితంలో జరిగాయి. అయితే అలా కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతాయి..కొన్ని కొన్ని సార్లు ఫ్లాప్ అవుతూ ఉంటాయి . ఫ్లాప్ అయితే పర్లేదు లైట్ తీసుకుంటాం . కానీ సక్సెస్ అయితే మాత్రం ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధని కూడా ఫేస్ చేసింది లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో నటించే ఛాన్స్ మిస్ చేసుకునింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్తూనే ఆయనతో నటించే ఆఫర్స్ రిజెక్ట్ చేసింది సాయి పల్లవి . ఆ సినిమా మరేదో కాదు పుష్ప . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో ముందుగా సాయి పల్లవిని ఊహించుకున్నారట డైరెక్టర్ సుకుమార్.

అదే విషయం ఆమెకు వివరించారట . అయితే కథ నచ్చిన సినిమాలో ఓ రొమాంటిక్ సీన్ ఉండడంతో చేయను అని చెప్పడం సుకుమార్ ఆ సీన్ కచ్చితంగా ఉండాలి అని చెప్పడంతో ఈ పాత్ర రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా ఈ శ్రీవల్లి పాత్ర సాయి పల్లవి చేసుంటే.. తెర పై ఇద్దరి డ్యాన్స్ అద్దిరిపోయేది ..సామీ సామీ పాట సాయి పల్లవి చేసుంటే ఇరగదీసేది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అలా ఒక క్రేజీ ఛాన్స్ మిస్ చేసుకుంది సాయి పల్లవి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news